ఐజేయూ ప్లీనరీలో కేఆర్ఎన్ తెలంగాణ నివేదిక
హర్యానాలోని పంచకులలో జరిగిన ఐజేయూ ప్లీనరీలో తెలంగాణ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఐజేయూ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ రాష్ట్ర నివేదికను ప్రవేశ పెట్టారు. ఈ సమావేశంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 250 మంది ప్రతినిధులు పాల్గొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్నసమస్యలపై చర్చించారు.కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వడం పట్ల సమావేశం హర్షం ప్రకటించింది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెన్షవ్ పధకం అమలు చేయాలని డిమాండ్ చేసింది. మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని, ప్రెస్ కౌన్సిల్ ను మీడియా కౌన్సిల్ గా మార్చాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, క్యాష్ లెస్ చికిత్స అందించాలని, జర్నలిస్ట్ లకు రైల్వే రాయితీ కొనసాగించాలని సమావేశం డిమాండ్ చేసింది.